రాజస్థాన్ లో తెలంగాణ సైబర్ పోలీసుల భారీ ఆపరేషన్*
*27 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్: సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడి
రాజస్థాన్‌లో సైబర్ సెక్యూ రిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహిం చారు. జయపుర, నాగౌర్, జోధ్ పూర్, సైబర్ సెక్యూ రిటీ పోలీసుల సోదాలు నిర్వహించారు.
దాదాపు 20 రోజులపాటు సెక్యూరిటీ పోలీసుల ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా 27 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా బ్యాంక్ చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు 31 బ్యాంక్ చెక్‌బుక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ సైబర్ ముఠాపై దేశవ్యా ప్తంగా పలు సైబ్ నేరాలు నమోదయ్యాయి. తెలంగాణలో 189, దేశవ్యాప్తంగా 2,233 కేసులు రిజిస్టర్ అయ్యాయి
29 నకిలీ ఖాతాల ద్వారా రూ.11.01కోట్లు ముఠా లూటీ చేసింది. నిందితుల నుంచి 31 సెల్‌ఫోన్లు, 37 సిమ్‌కార్డులు పోలీసుల బృందం స్వాధీనం చేసుకున్నది.
13 ఏటీఎం కార్డులు, ఏడు చెక్‌బుక్, రెండు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నది. తెలంగాణలో 189 కేసుల్లో రాజస్థాన్ ముఠా రూ.9 కోట్లు లూటీ చేసింది. పోలీసుల నిఘా పెరగ డంతో నగరాలు వదిలి ముఠాలు గ్రామాల వైపు దృష్టి పెట్టాయి.
మారుమూల గ్రామాల్లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ విలేకరుల సమావేశం నిర్వహించి.. సైబర్ నేరగాళ్ల అరెస్టుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. అనుమానిత లింక్స్‌ని ఎవరూ క్లిక్ చేయొద్దు సూచించారు.
లింక్‌లపై అనుమానం ఉంటే పోలీసులను ఆశ్రయించాలన్నారు. దక్షిణ ఆసియా సైబర్ నేరాలకు హబ్‌లా మారాయని.. రాజస్థాన్ ముఠా రాష్ట్రంలో భారీగా నేరాలకు పాల్పడిం దన్నారు. నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు.
సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన రూ.114కోట్లను బాధితు లకు తిరిగి ఇప్పించినట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు..