Search
Close this search box.

కామారెడ్డి సబ్ జైల్లో గాంధీ జయంతి మరియు తెలంగాణా ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా…జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఆర్.వి.వి వరప్రసాద్ సందర్శిం చారు

కామారెడ్డి సబ్ జైల్లో గాంధీ జయంతి మరియు తెలంగాణా ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా…

కామారెడ్డి జిల్లా సబ్ జైల్లో బుధవారం గాంధీ జయంతి వేడుకలను మరియు తెలంగాణ ఖైదీల సంక్షేమ దినం బుధవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ఆర్.వి.వి వరప్రసాద్ సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అండర్ ట్రియల్ లో ఉన్న ఖైదీ లు బైల్ పై బయట వచ్చిన తర్వాత సమాజంలో గౌరవంగా బతకాలని, తమ జీవితంలో కొత్త మార్పు వచ్చి సత్ ప్రవర్తనగా నడుచుకోవాలని సూచించారు.

ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి డి.ఎస్.పి డి నాగేశ్వరరావు కామారెడ్డి సిఐ ఎస్.రామన్, జైలు సూపరిండెంట్ సిహెచ్ సంజీవ్ రెడ్డి మరియు చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మాయ సురేష్, మరియు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ న్యాయవాది ఎం ఏ సలీం మరియు సహచట ప్రతినిధులు సిర్రపల్లి ప్రదీప్ కుమార్, తాహెర్ లు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉపన్యాసాలు ఇచ్చారు. అలాగే మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సబ్ జైల్లో ఉన్న ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు, సిఐ రామన్, జైలు సూపరింటెండెంట్ సంజీవ్ రెడ్డి, చీఫ్ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మాయ సురేష్, మరియు సమాచార హక్కుచట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ న్యాయవాది ఎం. ఏ సలీం, ప్రతినిధులు సిర్ణపల్లి ప్రదీప్ కుమార్, ఈక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి