వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి CMR టెక్స్టైల్స్ అండ్ జ్యువెల్లర్స్ సంస్థ 25 లక్షల రూపాయల విరాళం అందించింది. CMR డైరెక్టర్ వెంకట రమణ మావూరి గారు, ఇతర ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సీఎంఆర్ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.