ప్రతీ ఒక్కరూ గుండె ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు అన్నారు.
వరల్డ్ హార్ట్ డే సందర్బంగా హన్మకొండ హంటర్ రోడ్డులోని మెడికవర్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు హాజరయ్యారు. ఈ సందర్బంగా వరంగల్ లో మొదటిసారి గుండెకు సంబందించిన అదునాతన ఇంట్రా విజువల్ ఆల్ట్రా సౌండ్ పరికరాన్ని ఎంపీ గారు ప్రారంభించారు.
అనంతరం ఎంపీ గారు మాట్లాడుతూ మన జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. ఒకప్పుడు 50 నుండి 60ఏళ్ళు పైబడిన వారిలోనే హార్ట్ ఎటాక్ లు వచ్చేవని కాని ఇప్పుడు స్కూల్ విద్యార్థులలో కూడా హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయని తెలిపారు. దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు, శరీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం వంటివి ప్రధాన కారణాలని వివరించారు. ప్రతీ ఒక్కరూ గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండలాని, నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.