రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తండ్రి నలమాద పురుషోత్తమ్ రెడ్డి గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.