ఏపీలో నేడు మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ..
ఏపీ…. మొత్తం 3,736 వైన్ షాపులు
శ్రీకాకుళం జిల్లాలో 180 వైన్ షాపులు….
ఏపీలో నూతన మద్యం విధానానికి సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.ఏపీ మొత్తం 3,736 వైన్ షాపులు ఏర్పాటు చేస్తారు. వీటిలో 10 శాతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా 340 దుకాణాలను గీత కార్మికులకు కేటాయిస్తారు.
ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.10వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు, 50వేలలోపు ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షలలోపు ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల పైన ఉంటే రూ.85 లక్షల లైసెన్స్ ఫీజు చెల్లించాలి.