పోషణ్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే …..
ఈరోజు బిచ్కుంద మరియు మహ్మద్ నగర్ మండల కేంద్రాల్లో,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ (పోషణ మాసం) కార్యక్రమంలోజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు..
- ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పోషణ్ అభియా ఒక పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు..
- ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం మరియు పోషకాహార లోపాలపై అవగహన కల్పించారు..
- పౌష్టిక ఆహారం లోపం వల్ల రక్త హీనత, జనన బరువు తగ్గుదల మొదలగు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని చెప్పారు..
- గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకుంటే తల్లి బిడ్డ ఎలాంటి పోషకాహర లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు..
- పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించాలని,ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే బిడ్డకు ఆహారంగా ఇవ్వాలని,తల్లి పాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని, బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహద పడతాయన్నారు..
- ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలను సమయానికి అందజేయాలని అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్త్ వర్కర్లకు సూచించారు..
- పోషకార లోపాలను అదిగమించడానికి అంగన్వాడీ వర్కర్లు మహిళలలో అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు..
- అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో సిబ్బంది కొరత , మౌలిక సదుపాయల సమస్యలు గురించి తన దృష్టికి వచ్చిందని..
- త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు..