కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిస్టిక్ మెజిస్ట్రేట్ గారికి విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ డిమాండ్…..
మంగళవారం రోజున ఆరవ తరగతి పసిపాపపై కామారెడ్డి జిల్లా జీవదాన్ హైస్కూల్లో అక్కడ ఉన్నటువంటి పిఈటి నాగరాజ్ లైంగిక దాడి చేసినప్పటికీ ఏమాత్రం స్పందించని జిల్లా విద్యాశాఖ అధికారి, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు ప్రభుత్వ పాఠశాలలో గాని అటు ప్రైవేటు పాఠశాలలో కొన్ని చోట్ల కొంత గత కొంతకాలంగా చిన్నారులపై లైంగిక వేధింపులు అసభ్య ప్రవర్తన కొంతమంది అధ్యాపకులు ప్రవర్తిస్తున్న పనితీరును చెడు అలవాట్లను ఏమాత్రం పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ కరువైపోయింది. ఏ ప్రభుత్వం మీకు జీతభత్యాలు ఇవ్వడం లేదన కొన్ని ప్రైవేటు పాఠశాలలతో కొంతమంది మండల విద్యాశాఖ అధికారులతో మామూళ్ల మత్తులలో అధిక దోపిడీకి పాల్పడుతూ, ఎంత మంది చిన్నారుల జీవితాలు నాశనం చేస్తారు. ఈరోజు స్వయంగా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా గారు వచ్చి అడిగినప్పటికీ ఏమాత్రం స్పందించినటువంటి మీరు ఒకజిల్లా విద్యాశాఖ అధికారిగా మీరు పని చేయాల్సిన అవసరం లేదు. డిస్టిక్ మెజిస్ట్రేట్లే మీరు చేస్తున్నటువంటి పనిని చేయాలా అటువంటి అప్పుడు మీరేం చేస్తారు, అని ఆయన పై మండిపడుతూ కామారెడ్డి జీవదాన్ పీఏటి నాగరాజును సస్పెండ్ చేస్తూ అలాగే ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తూ, తగు చర్యలు తీసుకోవాలని లేనియెడల తెలంగాణ స్టూడెంట్ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేసేంతవరకు, విద్యార్థి సంఘాలు వెనుకాడ బొమని ఉమ్మడి జిల్లా విద్యార్థి సంఘం నాయకులు తన ఆవేదనని వ్యక్తం చేశారు.