ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామస్తులు సర్పంచ్ అవినీతిపై విచారణ చేపట్టాలని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హెచ్ ఎస్ ఓ రవికుమార్ గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేసిన సుర్బిర్యాల్ వాసులు న్యాయం కోసం పట్టుబట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత అధికారంలో ఉండగా సుమారు నాలుగు కోట్ల అవినీతికి పాల్పడిందని గ్రామస్తులు ఆరోపించారు. చేయని అభివృద్ధి పనులకు చేసినట్టు తప్పుడు బిల్లులు సృష్టించి, నాలుగు కోట్ల అవినీతికి పాల్పడినట్టు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా గ్రామానికి సంబంధించిన భూమిలో సొంతంగా మడిగెలు నిర్మించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. దీంతో అక్రమ నిర్మాణాలని గ్రామ సర్వ సమాజ్ జప్తు చేస్తుకుందని, ఇకమీదట సర్పంచ్ అవినీతి బాగోతం అంతా బయటపడే వరకు గ్రామమంతా ఏకమై ఒక తాటిపై పోరాడుతామన్నారు. జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి అవినీతిని నీకు తేల్చాలని వారు డిమాండ్ చేశారు..