గురువు – శిష్యుడు
అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జికుక్క పిల్లాలతో,వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తు ఉండేది,ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతుండగా ఓకబావికనిపించింది.ఆబావిని చూపించి మీరు ఎవ్వరు, ఈ బావి దగ్గరకు వెళ్ళకండి.చాలా ప్రమాదము,అని చెప్పింది.కుక్క పిల్లలు ఒక రోజుఆడుతు ఆడుతు ఆ బావి దగ్గరకే వాటిలో వచ్చాయి. ఒక బుజ్జి కుక్క, అమ్మ ఎందుకు అలా చెప్పింది?.ఇదేమిటో చూడాలి,అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది.
బావిలో తన నిడను చూసి,బావిలో నిజంగా ఇంకొక కుక్క
పిల్ల ఉందనీ దాని మీద అరవటం మొదలు పెట్టింది.
లోపల ఆ కుక్క ప్రతిబింబం,దీని లాగే అరవటం చూసి
దానితో పొట్లాడడానికి బావిలోకి ఒక్క దూకు దూకింది ఇంకేముంది ,కుక్క నీళ్లలో పడి కొట్టుకుంటు పెద్దగా
రక్షించండి అని అరవటం మొదలెట్టింది.ఆ దారినే వెళ్తున్నా ఓక రైతు,అయ్యో,! కుక్క నీళ్లల్లో పడిపోయిందే పాపం,అని దాని బయటికి తీసి రక్షించాడు.
నీతి: పెద్దలు చెప్పిన మాటలు వినాలి.కావాలంటే ప్రశ్నించవచ్చుకానీ, ఎప్పుడు దిక్కరించ కూడదు.