వరద బాధితుల సహాయార్థం శ్రీ ఇందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఇబ్రహీంపట్నం) తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. కాలేజీ చైర్మన్ ఆర్. వెంకట్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం అందించినందుకు ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.