వరద బాధితుల సహాయార్థం భాష్యం విద్యా సంస్థల తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి 1కోటి 25లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ముఖ్యమంత్రి గారు వారిని అభినందించారు.