వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ సంస్థ 10కోట్ల 25లక్షల 65వేల 273 రూపాయల భారీ విరాళాన్ని అందించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ బలరాం నాయక్ గారు, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ విరాళం ఇచ్చిన సింగరేణి కుటుంబీకులు అందరికీ ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు తెలిపారు.