Search
Close this search box.

కామారెడ్డి జిల్లా SP సింధు శర్మ ని కలిసిన MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య

కులాంతర పెళ్లి చేసుకున్న దంపతులు అంత్యక్రియలకు హాజరైతే సాంఘిక బహిష్కరణ చేసి కులం పేరుతో అవమానపరిచిన వ్యక్తుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య, జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి నాగభూషణం, జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాజన్న, ఉమ్మడి జిల్లా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు మల్లని శివ మాట్లాడారు. తాడ్వాయి గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులానికి చెందిన ఎరుకట్ల అక్షయ అదే గ్రామానికి చెందిన బీసీ కుర్మా కులానికి చెందిన బీర్ల అనిల్ గత ఐదు నెలల క్రితం ప్రేమించుకొని కులాంతర పెళ్లి చేసుకోవడం జరిగిందని, గత నెల అనిల్ మేనమామ బీర్ల రాజయ్య మృతి చెందాడని తెలిస్తే అంత్యక్రియలకు వెళ్ళినందుకు మాదిగ కులానికి చెందిన అమ్మాయితో ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీవు కూడా మాదిగ కులానికి చెందిన వాడివి అయినవాని , మీరిద్దరూ ఇక్కడ ఉంటే మేము అంత్యక్రియలు చేయమని చెప్పడంతో వెంటనే అక్కడినుండి తిరిగి రావడం జరిగిందని తెలిపారు. దీనిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్సైకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని ఎమ్మార్పీఎస్ నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్సై అవమానించి మాట్లాడుతున్నాడని తెలిపారు. అంతేకాకుండా కుర్మా కులస్తులు అనిల్ వారి అమ్మానాన్నతో కుర్మా కులస్తులతో మాట్లాడిన కూడా 5 లక్షల రూపాయల జరినామా అనిల్ కు విధిస్తామని అనడం జరిగిందని దీని పైన ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే జిల్లా ఎస్పీ గారు వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షయ అనిల్ పాల్గొన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు