Search
Close this search box.

కామారెడ్డి జిల్లాలో ఆరోగ్య శ్రీ సిబ్బంది సమ్మెకు మద్దతు తెలిపిన CITU జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్.

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ మిత్రాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఆరోగ్య మిత్రాలు గత 16సంవత్సరాల నుండి ఆరోగ్యశ్రీ ఉద్యోగాలు నిర్వర్తిస్తూ స్కిల్ ఎంప్లాయిస్ అయ్యుండి, ఆన్ స్కిల్డ్ జీతం తీసుకోవడం బాధాకరం అన్నారు. వీళ్లు సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చొరవ చెప్పకపోవడంతో శాంతియుత మార్గంలో నిరవధిక సమ్మె చేస్తున్నారు.వీరికి మా రాష్ట్రకమిటీ జిల్లాకమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. వీరి ప్రధాన డిమాండ్ అయినటువంటి క్యాడర్ చేంజ్ మరియు Go 60 ప్రకారం జీతాలు తక్షణమే పెంచాలని సమాన పనికి మా వేతనం చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.రేపు ఆరోగ్యశాఖ మంత్రి తో జరిగే చర్చలు ఆరోగ్యమిత్రాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆరోగ్య మిత్రాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అల్లావుద్దీన్ , గంగాధర్ లు మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్య మిత్రాల సమస్యలు పరిష్కారం విషయంలో కాలయపన చేస్తూ ఆరోగ్య మిత్రాలను ఆందోళనకు గురిచేయడం విచారకరం అన్నారు . తక్షణమే క్యాడర్ చేంజ్ మరియు go 60 ప్రకారం జీతాల పెంపు చేయాలని సమాన పనికి సమాన వేతన చట్టం అమలు చేసి ఆరోగ్యమిత్రలకు అండగా ఉండాలని కోరారు. రేపు జరగబోయే చర్చలు మిత్రులకు అనుకూలంగా సఫలం కావాలని సమస్యలు పరిష్కారం చేయాలని లేనిపక్షంలో రాబోయే కాలంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వం ఆజ్యం పోసినట్లు అవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్రాలు కృష్ణవర్థన్ , మహేందర్, అంజయ్య, అనిల్, జయవర్దన్, మహేష్ , రాజు, నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Oplus_131072
నిరుపేద కుటుంబానికి 81,000/రూ ఆర్థిక సహాయం
భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు