ఒక తండ్రి చనిపోయే ముందు కొడుకు ని పిలిచి…ఈ చేతి గడియారం 200 సంవత్సరాల పూర్వం మీ ముత్తాత వాడినది. ఒకసారి నగల దుకాణం దగ్గరకు వెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు, ఎంత ఇస్తారో అడుగు అంటాడు.
కొడుకు నగల దుకాణంకు వెళ్ళి అడిగితే చాలా పాతది కాభట్టి 150 రూపాయలు ఇవ్వగలం అంటారు.
అదే విషయం తండ్రికి చెప్తే ఒకసారి పాన్ షాప్ దగ్గర అడిగి చూడు అంటాడు.
పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే బాగా త్రుప్పు పట్టి ఉంది 10 రూపాయలకి కొనగలను అని చెప్తాడు.
ఈ సారి తండ్రి కొడుకుతో ..మ్యూజియం దగ్గరికి వెళ్ళి అడిగి చూడు అంటాడు.
వాళ్ళు అది చూసి ఇది చాలా పురాతనమైనది మరియూ అత్యంత అరుదైనది. 5 లక్షలు ఇవ్వగలం అంటారు.
అప్పుడు తండ్రి కొడుకుతో…”ఈ ప్రపంచం చాలా వైవిధ్యమైనది. నీకు ఎక్కడ విలువ ఉండదో అక్కడ ఉండకు,
అలా అని వారి మీద కోపం వద్దు; వారితో వాదించి కూడా ప్రయోజనం ఉండదు.
నీకు తగిన విలువ దొరికిన చోట ఉండు” అని చెప్తాడు…