వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ ఒక కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి గారు, జేఎండీ శ్రీనివాసరావు గారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ కెఆర్ సీ శేఖర్ గారు, బిజినెస్ యూనిట్ హెడ్ ప్రవీణ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ వీవీఎన్ రెడ్డి గారు జీఎం మహిపాల్ రెడ్డి గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వ కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి గారు అభినందించారు.