వరద బాధితుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 65 లక్షలు విరాళంగా అందించారు. బ్యాంకు చైర్మన్ కె. ప్రతాప రెడ్డి గారు బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మక్కడ్ గారు చైర్మన్ సెక్రెటరీ ఆర్. యశ్వంత్ గారు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆ మేరకు చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో స్పందించి ప్రభుత్వానికి అండగా తమ వంతు చేయూతను అందించిన APGVB కార్యవర్గానికి, సిబ్బందికి ఈ సందర్భంగా సీఎంగారు ధన్యవాదాలు తెలియజేశారు.