విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
ఈరోజు మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు శంకుస్థాపన చేశారు..
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, లక్ష రూపాయల రుణమాఫీ కూడా సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..
నేడు అదే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి ఆదరణ పొందుతుంటే ఓర్వలేక ధర్నాల పేరిట ప్రజలను, రైతులను మభ్య పెడుతున్నారని అన్నారు..
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని,దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని నిండా ముంచింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు..
కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, హామీ ఇస్తే అమలు చేసి తీరుతుందని చెప్పారు..
కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ ఆగిపోయిందని..
త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు..