శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా అలేఖ్య గౌడ్ నియామకం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 18వ తేదీన రవీంద్ర భారతి ఆడిటోరియంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ ఉత్సవ కమిటీ కన్వీనర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షు రాలు అలేఖ్య గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా అలేఖ్య గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 54 మంది గౌడ నాయకులను కన్వీనర్లు గా నియమించారు, అందులో నేను కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది అంటూ, ఇంత గొప్ప కార్యక్రమానికి కన్వీనర్ గా నియమించినందుకు అలేఖ్య గౌడ్ తాడి కార్పొరేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.