పాలకుర్తి ఆగస్టు 17: ప్రభుత్వ దవాఖానలో డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని ప్రజల సమాచారంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్ ఐ రాకేష్ తనిఖీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మార్వో శ్రీనివాస్ మాట్లాడుతూ ఆస్పత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించగా గత పది రోజులు నుండి డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల రోగుల సంఖ్య పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని డాక్టర్లు విధి నిర్వహణలో జాప్యం జరుగుతుందని ఈ యొక్క నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుందని ఎమ్మార్వో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ హు మన్ సోసైటీ మండల అధ్యక్షులు పసూలది ఐలయ్య, రేగల కృష్ణ, ఏఎన్ఎంలు ఆస్పత్రి సిబ్బంది పాల్గొనడం జరిగింది.