తేది 15.08.2024
అదిలాబాద్ జిల్లా
జిల్లాలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జిల్లా పోలీస్ పరెడ్ గ్రౌండ్ లో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (ఎస్సీ ఎస్టీ బిసి సంక్షేమ శాఖ) మహమ్మద్ షబ్బీర్ అలీ గారు,జిల్లా పాలనాధికారి రాజర్షి షా గారు, జిల్లా ఎస్పి గౌస్ ఆలం గార్లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం లో ముందుండి పరిష్కరిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలమేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని, ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల్ నుండి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు.
వివిధ పాఠశాల నుండి విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తిని పెంపొందించే సంస్కృత కార్యక్రమాలను తిలకించి చక్కని ప్రదర్శన గావించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ తిలకించారు.