Search
Close this search box.

లోక్ సభ స్పీకర్ పోస్టుపై ట్విస్ట్-ఎన్డీయే యూటర్న్- పోటీలో కాంగ్రెస్ ఎంపీ సురేష్…!

లోక్ సభ స్పీకర్

         18వ లోక్ సభలో స్పీకర్ పోస్టుపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని అంతా భావిస్తున్న తరుణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తొలుత విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇస్తామని, కాబట్టి స్పీకర్ గా తాము నిలబెట్టే అభ్యర్ధికి మద్దతివ్వాలని కోరిన అధికార ఎన్డీయే.. చివర్లో ప్లేటు ఫిరాయించింది. స్పీకర్ అభ్యర్ధిగా గత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మరోసారి నిలబెట్టింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కే సురేశ్ తో స్పీకర్ గా నామినేషన్ వేయించింది. ఎన్డీయే కూటమి ఓం బిర్లాతో మరోసారి స్పీకర్ గా నామినేషన్ వేయించిన నేపథ్యంలో.. చివరి నిమిషంలో ఇండియా కూటమి కేరళలోని మావెలిక్కర సీటు నుంచి ఎనిమిదోసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన కొడికున్నిల్ సురేష్ ను రంగంలోకి దింపింది. వాస్తవానికి లోక్ సభలో అత్యంత సీనియర్ ఎంపీ అయిన సురేశ్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయాలని విపక్షం కోరినా ఎన్డీయే పట్టించుకోలేదు. చివరికి ఆయన రెగ్యులర్ స్పీకర్ అభ్యర్దిగా ఇవాళ నామినేషన్ వేయాల్సి వచ్చింది. దీంతో రేపు ఓం బిర్లా, సురేశ్ మధ్య లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది.

          వాస్తవానికి లోక్ సభ స్పీకర్ పదవిని గెల్చుకోవడానికి ఎన్డీయే వద్ద తగినంత బలం ఉంది. అయితే దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పోస్టు విషయంలో ఎన్డీయే తొలుత సరే అని చెప్పి ఇవాళ మౌనంగా ఉండిపోయింది. అలాగే స్పీకర్ గా గత లోక్ సభలో రికార్డు స్ధాయిలో 115 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి చెడ్డపేరు మూటగట్టుకున్న ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వడంపై ఇండియా కూటమి గుర్రుగా ఉంది. దీంతో చివరి నిమిషంలో చేసేది లేక స్పీకర్ పోస్టుకు విపక్షం అభ్యర్ధిని నిలబెట్టింది. తాజా ఎన్నికల్లో మావెలిక్కర ఎంపీ స్ధానం నుంచి గెలిచిన సురేశ్.. గతంలో నాలుగు సార్లు ఇదే సీటు నుంచి విజయం సాధించారు. అలాగే అదూర్ నియోజకవర్గం నుండి కూడా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. తొలిసారి 1989లో లోక్‌సభకు ఎన్నికైన సురేష్.. 2009 నుండి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని రెండవ యూపీఏ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా పనిచేసారు. 2021లో కేరళ కాంగ్రెస్ చీఫ్ పదవికి పోటీపడిన సురేష్ ఇప్పుడు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడుగా, కాంగ్రెస్ కేరళ యూనిట్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా గతంలో పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి