Search
Close this search box.

వయనాడ్‌ విలయంలో పెరుగుతున్న మృతులు

70కి చేరిన మృతుల సంఖ్య.. మరితం పెరిగే ఛాన్స్‌

బాధితులకు సవిూప ఆస్పత్రుల్లో చికిత్స

సహాయక చర్యలకు అడ్డంకిగా వర్షాలు

కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 70 దాటింది. రాష్ట్రంలో కేవలం 24 గంటల్లో 372 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ విలయంలో 63 మంది జలసమాధి అయ్యారు. సుమారు 100 మందిదాకా గాయపడ్డారు. వారు మెప్పడిలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానిక అధికారలు వెల్లడిరచారు. ఇక పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారంతా శిథిలాల కింది నుంచే తమ ఆత్మీయులకు ఫోన్‌ చేసి తమను కాపాడండి అంటూ విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానిక విూడియా టీవీల్లో ప్రసారం చేస్తోంది.

మెప్పడి, ముందక్కాయి పట్టణం, చూరల్‌ మాలాలో మంగళవారం తెల్లవారుజామున ఈ విలయం సంభవించింది. తొలుత రాత్రి ఒంటి గంటకు ముందక్కాయి పట్టణంలో భారీ వర్షం కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్న సమయంలోనే.. చూరల్‌మాలాలో తెల్లవారుజామున 4 గంటలకు మట్టిచరియలు విరిగిపడ్డాయి. క్యాంపుగా మారిన స్కూల్‌తో పాటు సవిూప ఇంళ్లలోకి నీరు ప్రవేశించింది. వరద నీరు, బురదతో నిండిపోయాయి. ఈ విలయంలో చూరల్‌ మాలా పట్టణం సగం వరకూ తుడిచి పెట్టుకుపోయినట్లు స్థానిక విూడియా నివేదించింది. చూరల్‌ మాలాలో బ్రిడ్జ్‌ కూలిపోవడంతో సుమారు 400 కుటుంబాలు అక్కడ చిక్కుకుపోయాయి. వరద కారణంగా రోడ్లు, వంతెనలు సైతం పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్స్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఆర్మీ వర్షంలోనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సుమారు 225 మంది సైనిక సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకూ 220 మందిని అధికారులు రక్షించి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.వయనాడ్‌ విలయానికి చెందిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తీవ్రంగా ప్రవహిస్తున్న నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. ముందక్కాయిలో ఉన్న ఓ మదరసాలో 150 మంది చిక్కుకున్నారు. 4 గంటల్లోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడడంతో.. రోడ్లు, బ్రిడ్జ్‌లు కొట్టుకుపోయాయి. రైల్వే లైన్లు కూడా దెబ్బతినడంతో.. రైలు సర్వీసులను అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి