Search
Close this search box.

నీతి ఆయోగ్‌ సమావేశ బహిష్కరణ 

ఆనాడు కెసిఆర్‌ బహిష్కరిస్తే విమర్శలు

కాంగ్రెస్‌ పార్టీది ద్వంద్వ వైఖరన్న కెటిఆర్‌

నీతి అయోగ్‌ సమావేశ బహిష్కరణపై కాంగ్రెస్‌ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని కేటీఆర్‌ నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో సమావేశాన్ని నాడు కేసీఆర్‌ బాయ్‌కాట్‌ చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టిందని, ఇరువురు కుమ్మక్కయ్యారని ఆరోపించిందని చెప్పారు. మరి ఇప్పుడు నీతి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాని రేవంత్‌ రెడ్డి స్వయంగా ప్రకటించడంపై కాంగ్రెస్‌ ఏం చెబుతుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీని చోటే భాయ్‌ ఎందుకు కలవానుకోవడం లేదు?, కేంద్ర బడ్జెట్‌లో రాష్టాన్రికి జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదని ఎక్స్‌ వేదికగా నిలదీశారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా నీతి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు అప్పట్లో సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తే పీసీసీ అధ్యక్షునిగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానిని నిలదీయడానికి నీతి అయోగ్‌ సమావేశం ఒక మంచి అవకాశమని వాదించారు. ఆ సమావేశానికి సీఎం కేసీఆర్‌ వెళ్లాలని డిమాండ్‌ చేశారు. అదే రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎంగా కేంద్ర బ్జడెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా నీతి అయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తు న్నట్టు బుధవారం శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. నీతి అయోగ్‌ సిఫారసులకు కేంద్రం విలువ ఇవ్వనప్పుడు ఆ సమావేశానికి వెళ్లడంలో అర్థం లేదనే బహిష్కరిస్తున్నట్టు రెండేండ్ల కిందట సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మిషన్‌ కాకతీయకు రూ.5 వేల కోట్ల గ్రాంట్‌, మిషన్‌ భగీరథకు రూ.19,500 కోట్ల గ్రాంట్‌ తెలంగాణకు ఇవ్వాలని నీతి అయోగ్‌ చేసిన సిఫారసును కేంద్రం పట్టించుకోకపోవడంతో.. నిరసనగా నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు కేసీఆర్‌ వివరించారు. కేంద్రం వైఖరిని తప్పు పట్టాల్సింది పోయి అప్పుడు పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్నే తప్పుపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి