Search
Close this search box.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?

ఆర్టీసీలో ఉద్యోగులపై పనిభారం మోపుతున్నారు

మహాలక్ష్మి పథకంతో కార్మికుల పెరిగిన భారం

ప్రశ్నోత్తరాల సమయంలో హరీష్‌ రావు

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారు ? 

అపాయింట్‌మెంట్‌ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్‌ అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానాలు ఒకరకంగా చెప్పాలంటే బాధ్యతా రహితంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటీ? అన్నప్పుడు లేదండీ అన్నారని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ’ప్రభుత్వం వచ్చి ఎనిమిదో నెల జరుగుతున్నది. ఇంకా జాప్యం జరుగలేదని చెప్పారు. ఎప్పటిలోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి.. నియమితరోజు ప్రకటించడం అవుతుందా? అంటే పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో పేజీ నెంబర్‌ 28లో ఐటెమ్‌ నంబర్‌ 14లో టీఎస్‌ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం అని పెట్టారు. ఇందులో ఆర్టీసీ కార్మికులను, ప్రభుత్వ విలీన పక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం అని చెప్పారు. ఎనిమిది నెలల సమయం సరిపోదా?’ అంటూ ప్రశ్నించారు. వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను ఆధునికకీరించి.. విస్తరిస్తాం. అధునాతమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్‌ పునరుద్ధరణకు అనుమతిస్తాం’ అని మేనిఫెస్టోలో చెప్పారు. విషయాల్లోకి వెళ్లకుండా మంత్రిని సూటిగా ప్రశ్నించ దలచుకున్నాను. మంత్రి ఎప్పటిలోగా అపాయింటెడ్‌ డే ప్రకటిస్తారు ? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు ? పరిశీలనలో ఉంది.. చూస్తాం.. చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మంత్రిని కోరుతున్న. యూనియన్‌ పునరుద్ధరిస్తామని విూరు హావిూ ఇచ్చారు. యూనియన్‌ పునరుద్ధరణ ఎప్పటిలోగా చేస్తారు ? మాకున్న సమాచారం ఏందంటే ప్రభుత్వం నుంచి యూనియన్‌ను పునరుద్ధరించేది లేదని ఉత్తర్వులు ఇచ్చినట్లుగా మా దృష్టికి వచ్చింది. ఉత్తర్వులు ఇచ్చారా? లేదా? ఇవ్వకపోతే ఎప్పటిలోగా యూనియన్‌ను పునరుద్ధరిస్తారు’ అంటూ నిలదీశారు. ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో పిల్లలకు పర్మినెంట్‌ ఉద్యోగం ఇచ్చేవాళ్లం. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆ పర్మినెంట్‌ ఉద్యోగం అనే నిబంధన తీసివేసి.. మరో స్కీమ్‌ను పెట్టి కేవలం రూ.15వేల జీతం ఇచ్చి మూడేళ్లు పని చేస్తే అప్పుడు పర్మినెంట్‌ చేస్తామని చనిపోయిన కార్మికులకు విూ ప్రభుత్వం అన్యాయం చేసినమాట వాస్తవమా? ఇది ఎందుకు తెచ్చారు ? గత ప్రభుత్వంలాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. ముఖ్యమంత్రి, మంత్రి నెª`లకెస్‌ రోడ్‌లో మా ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపారు సంతోషం. ప్రభుత్వం నిరంతర పక్రియ. అయితే, జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు రూ.300కోట్ల చెక్కును సీఎం చూపించారు. ఇగో కార్మికులకు పీఆర్సీ బకాయిలు విడుదల చేస్తామని చెక్కు చూపారు. పాపం మంత్రి సీఎం వెళ్లిపోయాక డవ్మిూ చెక్కులు కార్మికులు ఇచ్చి ఫొటోలు దిగారు. ఈ చెక్కులు ఫిబ్రవరి 10, 2024 రోజున ఇచ్చారు. మనం ఇవాళ జూలై నెలలో ఉన్నాం. దాదాపు ఐదునెలలైనా నెక్లేస్‌రోడ్‌ నుంచి ఆ చెక్కు బస్‌ భవన్‌కు చేరలేదు. ఆ చెక్కు ఎప్పడు చేరుతుంది ? ఎప్పుడు ఇస్తరు చెప్పాలని కోరుతున్నా’నన్నారు. ఆర్టీసీలో ఉద్యోగులపై పనిభారం మోపుతున్నారని.. కొత్త ఉద్యోగులను ఎప్పుడు నియమిస్తారని మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రశించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ.. ’మహాలక్ష్మి పథకం తెచ్చారు సంతోషం. అభినందిస్తున్నాం. ఈ పథకానికి నెలనెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని ఇప్పటి వరకు ఇచ్చినవి ఎన్ని.. ఇవ్వకపోవడం వల్ల కార్మికుల పీఎఫ్‌, సీసీఎస్‌ డబ్బులు మళ్లించి 

కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. గతంలో మా ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు బడ్జెట్‌లో రూ.100కోట్లు పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.200కోట్లు పెట్టింది. కానీ, ప్రభుత్వం రూ.1000కోట్లు, రూ.1500కోట్లు, రూ.1500కోట్లు బడ్జెట్‌లో పెట్టి ఆర్టీసీ సంస్థను కాపాడాం’ అన్నారు. మధ్యలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగానికి అడ్డు తగిలారు. క్వశ్చన్‌ అవర్‌లో ప్రసంగాలు ఇస్తున్నారన్నారు అన్నారు. దీనికి హరీశ్‌రావు స్పందిస్తూ సూటిగా మంత్రికి ప్రశ్నలు వేశానన్నారు. ఆర్టీసీకి సంబంధం విషయాలు,రాజకీయాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ’ఆర్టీసీలో దివ్యాంగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు రాయితీతో బస్‌పాస్‌లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో రాయితీలకు సంబంధించి ఒక్క రూపాయి ఇవ్వమని మాట వస్తవమా? ఆ డబ్బు ఎంతా? ఎప్పటి వరకు ఇస్తారు ? ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటీ? అని ప్రశ్‌నించారు. కార్మికులకు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ యాక్ట్‌ ఉంటుంది. డ్రైవర్లు, కండక్టర్లు ఎనిమిది గంటలకంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది. అందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. వారిని 16గంటలు, 18 గంటలు పని చేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చాక ఓవర్‌లోడ్‌ కావడం ద్వారా పనిగంటల భారం పెరిగి.. దానికి సరిపడా కండక్టర్లు, డ్రైవర్లను నియామకం చేయకపోవడం వల్ల కార్మికులు ఓవర్‌టైం చేసి ఇబ్బందులుపడున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా నియామకం ఎప్పటిలోగా చేస్తారు? ప్రభుత్వాన్ని రాజకీయాల్లోకి వెళ్లకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పక్రియ ఏర్పాటు చేయాలని.. స్పెసిఫిక్‌ డేట్‌ ఇచ్చి.. రాష్ట్రంలో ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపికబురు అందించాలని స్పీకర్‌ ద్వారా సీఎం, రవాణాశాఖ మంత్రిని కోరుతున్నా’నన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి