పిఠాపురం, జూలై 23 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, వారికి తగు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్వచ్ఛతవారోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ పంపన సూర్యచంద్రరావు అధ్యక్షతన ర్యాలీని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ స్వచ్ఛత వారోత్సవ ర్యాలీ కార్యక్రమానికి జనసేన జిల్లాకార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుర్గాడ గ్రామంలో పలు వీదులు గుండా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ నివాసాలకు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షంనీరు, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని దీని కారణంగా పలు రకాల దోమలను నివారించవచ్చని, తద్వారా వ్యాదులను నివారించవచ్చునని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ వార్డు సభ్యులు వెలుగులు సతీష్, శాఖ సురేష్, మేడిబోయిన శ్రీను, వెలుగుల లక్ష్మణ్, ఆకుల అర్జున్, శాఖ నాగు, రావుల వీరబాబు, కాపారపు పూసలు, కొసిరెడ్డి ఆదినారాయణ, వెలుగుల రాంబాబు, విప్పర్తి శ్రీను, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.