Search
Close this search box.

టీమిండియా చేతుల్లో ఓటమి.. వార్నర్ సంచలన నిర్ణయం!

వార్నర్

          టీ20 వరల్డ్ కప్ ఫేవరెట్స్​లో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. సూపర్-8లోనే ఇంటిదారి పట్టింది. భారత్, ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో ఓడిన కంగారూ జట్టు సెమీస్​కు ముందే టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్ దశలో అదరగొట్టిన ఆసీస్.. సూపర్-8లో మాత్రం చతికిలపడింది. తొలుత ఆఫ్ఘాన్ చేతుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ తర్వాత భారత్ మీద కూడా ఓడి దాదాపుగా నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. తాజాగా బంగ్లాదేశ్​ను రషీద్ సేన ఓడించడంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. ఈ తరుణంలో ఆ టీమ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెబుతున్నట్లు ప్రకటించాడు.​ ఇప్పటికే వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఓపెనర్.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.

         కెరీర్​లో ఎన్నో ట్రోఫీలను ముద్దాడాడు వార్నర్. గతేడాది వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ఆసీస్ జట్టులోనూ అతడు కీలకంగా వ్యవహరించాడు. మెగాటోర్నీల్లో కంగారూలు ఛాంపియన్స్​గా నిలవడంలో అతడిది కీలకపాత్ర. అలాంటోడు ఇంకో ఐసీసీ ట్రోఫీని చేతబట్టి ఘనంగా కెరీర్​కు గుడ్​బై చెప్పాలని భావించాడు. అయితే టీమిండియాపై ఓటమితో అతడి ఆశలకు బ్రేక్ పడింది. సెమీస్​లోనే ఆ టీమ్ కథ ముగిసింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా వన్డే ఫార్మాట్​లో ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఆ టోర్నీలో అవసరమైతే టీమ్​కు ప్రాతినిధ్యం వహించేందుకు రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకుంటానని వార్నర్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే అతడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు.

       టీ20 వరల్డ్ కప్​లో సెమీస్​కు ముందే జట్టు ఇంటిదారి పట్టడంతో క్రికెట్ ఆస్ట్రేలియా సమూల మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్​లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని వారిని సెలెక్షన్​కు దూరంగా ఉంచే ఛాన్సులు ఉన్నాయి. అలాగే కొందరి కాంట్రాక్ట్​లు తీసేసే ప్రమాదం కూడా ఉందని వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే వన్డేలు, టెస్టులకు తాజాగా టీ20లకు గుడ్​బై చెప్పిన వార్నర్​కు కూడా దూరం పెట్టనున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోమని అతడ్ని కోరే అవకాశం లేదని ఆసీస్ మీడియా అంటోంది. ఇవన్నీ చూస్తుంటే ఇక ఐపీఎల్ లాంటి లీగ్స్ తప్పితే వార్నర్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్​లో కనిపించే అవకాశం లేదనే చెప్పాలి. మరి.. అద్భుత బ్యాటింగ్​తో కోట్లాది మందిని అలరించిన వార్నర్ రిటైర్మెంట్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి