బరిలోంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటన
కమలా హారిస్‌కు మద్దతు తెలిపిన అధ్యక్షుడు జోబైడెన్
తొలిసారి రేసులో భారత సంతతి అమెరికా మహిళ
బైడెన్ తప్పుకోవడాన్ని స్వాగతించిన ఒబామా
అనూహ్యంగా మిషెల్ ఒబామా పేరు తెరపైకి రాక
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగ ఆమారబోతున్నాయి. ట్రంప్‌కు పోటీగా మారోమారు బరిలిలో నిలవాలనుకున్న ప్రస్తు అధ్యక్షుడు జో బైడెన్ బరినుంచి తప్పుకున్నారు. తన మద్దతును ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రకటించారు. అనూహ్యంగా ఇప్పుడు తెరపైకి మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా పేరు కూడా వచ్చింది. భారతీయ మూలాలున్న కమలా హారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినట్లు వార్తు రావడం, మిషెల్ కూడా రంగంలోకి వచ్చినట్లు తేలడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 2024 అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని నిర్ణయించగా, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌కి తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 81 ఏళ్ల బైడెన్ వయోభారంతో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దేశ ప్రయోజనాల కోసం తాను పోటీ నుంచి తప్పు కొంటున్నట్లు ప్రకటించారు. డెమొక్రాట్ల సీనియర్ల ఒత్తిడిని గౌరవిస్తున్నట్లు వ్యాఖ్యానిం చారు. అయితే డెమొక్రాట్ల నుంచి కమలా హారిస్‌కే అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. కాలిఫోర్నియాలోని జమైకా`అమెరికన్ ప్రొఫెసర్ డోనాల్డ్ జె హారిస్, తమిళ జీవశాస్త్రవేత్త శ్యామాల గోపాలన్ దంపతులకు కమలా దేవి హారిస్1964 అక్టోబర్ 20న జన్మించారు. కమలా హారిస్ భారత సంతతి మహిళగా గుర్తింపు పొందారు. అయితే ఆమె తల్లిదండ్రులు కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. అనంతరం కమలా తన తల్లితో కలిసి జీవిస్తున్నారు. ఆమె తన బ్యాచిలర్ డిగ్రీ కోసం చారిత్రాత్మక ఆల్ బ్లాక్ కళాశాల అయిన హోవార్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. కమలా హారిస్ పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. అనంతరం న్యాయశాస్త్రంలో చేరారు. 1990 లో బార్ అసోసియేషన్ సభ్యురాలిగా మారి, అదే ఏడాది కాలిఫోర్నియాలో డిప్యూటీ డిస్టిక్ట్ అటార్నీగా వృత్తిని ప్రారంభించారు. 2003లో శాన్?ఫ్రాన్సిస్కో డిస్టిక్ట్ అటార్నీగా ఎన్నికయ్యారు. 2007 చివరలో, అప్పటికే జిల్లా న్యాయవాదిగా పనిచేస్తూ.. అధ్యక్ష బరిలో నిలిచిన బరాక్ ఒబామాకు మద్దతు తెలిపారు. ఒబామా అధ్యక్షుడైన తర్వాత 2010లో ఒకసారి, 2014లో మరోసారి అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించారు. 2017లో ఆమె తన స్వరాష్ట్రం నుంచి జూనియర్ యూఎస్ సెనేటర్ అయ్యారు. ఆరోగ్య సంస్కరణలు, పన్ను,వలసదారులకు పౌరసత్వం, తుపాకీ
నియంత్రణ చట్టాల విూద ప్రచారాలతో ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా మార్మోగిపోయింది. సెనేట్‌లో పనిచేసిన రెండో ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఆగ్నేయాసియా మహిళగా గుర్తింపు పొందారు. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన కమలా హారిస్, జో బైడెన్‌కు మద్దతుగా రేసు నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆయన పాలనలో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో దిగుతున్నారు. ఆగస్ట్‌లో జరగనున్న ఈవెంట్‌లో డెమొక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఈ నామినేషన్‌లో గెలిస్తే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి భారత సంతతి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారు.అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే, దేశానికి మొదటి భారతీయ సంతతి మహిళ అధ్యక్షురాలు కాగలరు. ’అమెరికా అధ్యక్ష రేసులో నిలిచేందుకు అధ్యక్షుడి ఆమోదం పొందడం గౌరవంగా ఉంది,’ అని కమలా పేర్కొన్నారు. జో బైడెన్ కన్నా కమలా హారిస్‌ను ఓడిరచడమే చాలా సులభం అని ట్రంప్ వ్యాఖ్యానించడం తో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైట్ హౌస్ రేసు నుండి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసించారు. బైడెన్ తీసుకున్న నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని ఒబామా వ్యాఖ్యానించారు. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయని.. అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బైడెన్ అంతర్జాతీయ వేదికపై అమెరికా గొప్పతనాన్ని ఇనుమడిరపజేశారని, నాటోను పునరుజ్జీవింపజేసినట్లు తెలిపారు.ఉక్రెయిన్ ` రష్యా యుద్దానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారన్నారు. అయితే రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని, అధ్యక్ష అభ్యర్థి ఎంపికలో డెమొక్రటిక్ పార్టీ ఆచితూచి అడుగులు వేయాలని అప్రమత్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ని అధ్యక్ష బరిలో నిలపాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నా.. ఒబామా ఈ అంశాన్ని లేవనెత్తకపోవడం, అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అనడం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు ప్రకటించగా.. ఒబామా మాత్రం ఇప్పటివరకు ఆమెకు మద్దతు ప్రకటించకపోగా.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన పక్రియతో ముందుకు రావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఒబామాను హారిస్‌కు మెంటార్‌గా చెబుతుంటారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మరో కీలక నేత నాన్సీ పెలోసీ సైతం కమలా హారస్‌కు మద్దతు ప్రకటించక పోవడంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. 2007లో జిల్లా న్యాయవాదిగా పనిచేస్తూ.. అధ్యక్ష బరిలో నిలిచిన బరాక్ ఒబామాకు కమలా.. మద్దతు తెలిపారు. ఒబామా అధ్యక్షుడైన తర్వాత 2010లో ఆమె అటార్నీ జనరల్‌గా విధులు నిర్వహించారు. ఇకపోతే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా ను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు కూడా బలపడుతున్నాయి. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించిన తరువాత మిషెల్ ఒబామా పేరు సోషల్ విూడియాలో ట్రెండిరగ్‌గా నిలిచింది. ఓ వైపు కమలా హ్యారిసే డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉంటుందని అంతా అనుకుంటుండగా.. మిషెల్ ఒబామా పేరు బయటకి రావడం గమనార్హం. ఆమె అభ్యర్థిత్వానికి పార్టీలోని చాలా మంది అనుకూలంగా ఉన్నట్లు అంతర్జాతీయ విూడియా కథనాలు వెల్లడిరచాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మూడు నెలలు ముందు ఆగస్టులో జరిగే డెమోక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఆ పార్టీ అభ్యర్థిగా మిషెల్ ఒబామాను ప్రకటించే అవకాశాలున్నాయని డెమోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు. ది సెంటర్ స్క్వేర్ ఓటర్స్ వాయిస్ ఇటీవలే
నిర్వహించిన సర్వే ప్రకారం.. అమెరికా ఓటర్లు తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా మిషెల్‌నే కోరుకుంటునట్లు తేలింది. ఈ సర్వేలో కమలా హారిస్ కంటే మిషెల్‌కే ఎక్కువ మద్దతు లభించింది. కమలా హారిస్ అభ్యర్థి త్వానికి బైడెన్ మద్దతు ప్రకటించగా.. ఒబామా మాత్రం ఇప్పటివరకు ఆమెకు మద్దతు ప్రకటించకపోగా.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన పక్రియతో ముందుకురావాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఒబామా లెక్కలు వేరేగా ఉన్నాయని.. తన భార్యను అధ్యక్ష బరిలోకి దింపడానికే కమలాకు మద్దతు ప్రకటించట్లేదని అంతర్గతంగా చర్చ నడుస్తోంది. సాధారణంగా అమెరికాకు ఒక్కరు గరిష్ఠంగా రెండుసార్లు అధ్యక్షులుగా వ్యవహరించొచ్చు. ఒబామా రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. ఇదే సమయంలో మిషెల్ ఒబామాకు నెటిజన్ల నుంచి మద్దతు వస్తోంది. ట్రంప్‌ని ఓడిరచగల ఒకే ఒక్క వ్యక్తి మిషెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘దయచేసి మిషెల్ ఒబామాపై దృష్టి పెట్టండి. కమలా హారిస్‌ని పోటీలో నిలపకండి. ఆమెకు ప్రజా సమస్యలు పట్టవు. ట్రంప్‌ని ఓడిరచలేరు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ కన్వెన్షన్ ఆగస్టు 19న చికాగోలో ప్రారంభం కానుంది. నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికలకు తమ అభ్యర్థిని ఎన్నుకునేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 4 వేల మంది ప్రతినిధులు ఇక్కడ సమావేశమవుతారు. ఆ తరువాత అభ్యర్థులు అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు నామినేషన్‌లు సమర్పిస్తారు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి