హత్యలపై పార్లమెంటులో లేవనెత్తుతాం
రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
నెల రోజుల టీడీపీ పాలనలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంట్‌లో గళమెత్తుతామని రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఏపీలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యను ఎంపీ ప్రస్తావించారు. బాధితుణ్ని కత్తితో చేతులు నరికి, తీవ్రంగా గాయపరిచి చంపడం దారుణం అని ఎంపీ అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేయకుండా సీఎం చంద్రబాబే వారి పార్టీ కేడర్‌ను ఆపాలన్నారు. ఈనెల 22నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో పరిస్థితులపై వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో జరిగే దాడులను దేశ ప్రజలకు సైతం తెలియజేస్తామని అయోధ్య రామిరెడ్డి అన్నారు. అందు కోసం ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తామని ఎంపీ వెల్లడిరచారు. ఏపీ పరిస్థితులు వివరించేందుకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. ఈనెల 24న మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో ఢల్లీిలో చేసే ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఏపీలో శాంతిభద్రతలు అదుపుతప్పాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈనెల 24న ఢల్లీిలో ధర్నా చేస్తామంటూ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. వినుకొండలో
హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి పరామర్శించారని చెప్పుకొచ్చారు. ఆంధప్రదేశ్ పరిస్థితులపై ఢీల్లీలో ధర్నా చేసి అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితులపై వివరిస్తామని చెప్పారు. రాష్ట్రపతి పాలనకు సైతం డిమాండ్ చేయనున్నట్లు ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెల్లడిరచారు.