Search
Close this search box.

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్‌

రేండ్రోజుల పాటు ఢల్లీిలోనే మకాం

కాంగ్రెస్‌ అగ్రనేతలో చర్చలు

మరోమారు పలువురు కేంద్రమంత్రులతో భేటీ

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రెండు రోజుల ఢల్లీి పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన హస్తినలో ఉండనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి రేంవత్‌ రెడ్డి ఢల్లీి చేరుకుంటారు. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో పాటు.. పలువురు కేంద్రమంత్రులను రేవంత్‌ రెడ్డి కలవనున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్‌ పదవుల పంపకం పూర్తవ్వడంతో.. మిగిలిన పదవులు ఎవరెవరికి కేటాయించాలి.. పదవులు దక్కని సీనియర్లను ఎలా గౌరవించాలనే విషయంపై కూడా అధిష్టానంతో రేవంత్‌ చర్చించనున్నారు. మరోవైపు వరంగల్‌లో ఏర్పాటుచేయబోయే భారీ సభకు రాహుల్‌ గాంధీని ఆహ్వానించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేయడంతో రాహుల్‌తో సభ పెట్టిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఈ విషయాన్ని హైకమాండ్‌కు రేవంత్‌ తెలియజేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను రేవంత్‌ రెడ్డి కలవనున్నారు. విభజన హావిూల అమలుతో పాటు.. కొత్త రుణాలు, ప్రాజెక్టుల మంజూరుపై వివిధ శాఖల మంత్రులతో సమావేశమవుతారు. రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసే అవకాశం ఉంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పెండిరగ్‌ ప్రాజెక్ట్‌ పనులను వేగవంతం చేయాలని కోరనున్నారు.సీఎం రేవంత్‌ రెడ్డి ఎఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు రాహుల్‌ గాంధీని కలవనున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై ఆయన చర్చించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తుండటంతో మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించి.. ఎవరిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలనేదానిపై రేవంత్‌ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు.. చేరికల అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ ఎంపికపై ప్రస్తుత ఢల్లీి పర్యటనలో క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది. గత ఢల్లీి పర్యటనలోనే పీసీసీ చీఫ్‌ ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ.. పార్టీలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పీసీసీ చీఫ్‌ ఎంపిక వాయిదాపడిరది. ఈసారి మాత్రం కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపికపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి