రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడు జరుగుతోంది
నిరుద్యోగ హావిూలను తుంగలో తొక్కారు
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కెటిఆర్ బృందం
మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్న సంగతి గురించి గవర్నర్‌కు తెలిపామని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హావిూలను నెరవేర్చని అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కెటిఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు శనివారం గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. ఆ తర్వాత కేటీఆర్ విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఇతర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఇచ్చిన హావిూలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుంగలో తొక్కుతోందో ఆయనకు వివరించాం. హావిూలు అమలు చేయాలన్న విద్యార్థుల అరెస్టులు, అక్రమ కేసులతో భయానక వాతావారణం సృష్టిస్తున్నారని వివరించామని అన్నారు. గవర్నర్ చాలా సీరియస్‌గా ఈ అంశాలపై స్పందించారు. హోంశాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగు తానని చెప్పారు. మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకున్న సంగతి గురించి గవర్నర్‌కు తెలిపాం. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నామని.. స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశామని ఆయనకు వివరించాం. ప్రొటోకాల్ ఉల్లంఘనలను కూడా గవర్నర్‌కు వివరించాం అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భారాస అండగా అండగా ఉంటుందని.. వారికి కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హావిూలు నెరవేర్చే వరకూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. రెండు ముఖ్యమైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హావిూలను గవర్నర్‌కు తెలియజేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హావిూలను తుంగలో తొక్కుతూ.. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు చేసి కేసు పెడుతున్నట్లు చెప్పాం. విద్యార్థులపై లాఠీలు రaులిపిస్తూ.. భయానక వాతావరణం సృష్టించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను యూనివర్సిటీల్లో చూస్తున్నామని కేటీఆర్ తెలిపారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రకటనలు ఇచ్చారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. కేసీఆర్ హయాంలో జారీ అయిన గ్రూప్`1, 2, 3 నోటిఫికేషన్లు రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హావిూని గుర్తు చేశామన్నారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని గవర్నర్‌కు చెప్పామని కేటీఆర్ తెలిపారు. మెగా డీఎస్సీ అని చెప్పారు కానీ వేయలేదు. నిరుద్యోగ భృతి 4 వేలు ఇవ్వలేదు. అన్నింటికి మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులను బయటకు ఈడ్చుకొచ్చి హింసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ ఉన్న విద్యార్థులపై దాడులు చేసి అప్రజస్వామికంగా వ్యవహరించారని వివరించి చెప్పామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ విూద గెలిచి.. కాంగ్రెస్ టికెట్‌పై పార్లమెంట్‌కు పోటీ చేశారు. మ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయంలో జరుగుతన్న అగౌరవాన్ని కూడా వివరించాం. ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖ రాస్తానని గవర్నర్ చెప్పారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తానని చెప్పారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని గవర్నర్ చెప్పారు. ఇక్కడితో ఆగకుండా రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండే పెద్దలను కలిసి కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని వివరిస్తాం. రాష్ట్రపతిని కూడా కలిసి చెబుతాం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హావిూని నిలబెట్టుకునే వరకు, గ్రూప్`2, 3 పోస్టులు పెంచేదాకా, నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా
ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, నిరుద్యోగులకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని, కాలె వెంకటేశ్,గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు కెటిఆర్ వెంట ఉన్నారు