గిట్టుబాటు ధరలు కూడా కల్పించని కెసిఆర్
రైతులకు రుణామఫీ ఏకకాలంలో చేసిన ఘనత మాదే
రాష్ట్రంలో ఆయిల్ పామ్‌కు మంచి అవకాశాలు
జిల్లా పర్యటనలో మంత్రులు తుమమల, పొన్నం, శ్రీధర్ బాబు
గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గిట్టుబాటు ధర కూడా కల్పించలేదని మండిపడ్డారు. రైతులు కాలర్ ఎగరేసుకున్న రోజు రావాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లిలో పర్యటించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తదితరులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు ఆర్థికంగా బలపడతారని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రాష్టాల్ల్రో తెలుగు రాష్టాల్రు ముందు వరుసలో ఉన్నాయని వివరించారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. భారత దేశ చరిత్రలో మే 6 వ తేది 2022 లో ఇచ్చిన హావిూని రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో అనంతరం రెడ్డి పంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన రైతుల సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. ఇది కలనా నిజమా అని రైతులు అనుకుంటున్నారని, గత ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీని నాలుగు, ఐదు విడుతలలో చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ ఒకసారి తరువాత లక్ష 50 వేలు, తరువాత 2 లక్షల రుణమాఫీ ఒకేసారి జరుగుతుందన్నారు. ఆయిల్ ఫామ్ కు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న అన్ని ఖర్చులూ పొగ లక్షల్లో ఆదాయం వస్తుందని, ఆయిల్ ఫామ్ లో అంతర పంటలు వేసుకోవచ్చని సూచించారు. 2 లక్షల 103 మెట్రిక్ టన్నుల ఆయిల్ మార్కెట్ జరుగుతుంటే బయటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని, రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల పైన ఆయిల్ ఫాం పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పెద్దపల్లి జిల్లాలో 45 వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం పెట్టడానికి ఇక్కడ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరినీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త బస్సులకు పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయని, చాలా చోట్ల కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోమూడు వేలకు పైగా నియామకాలకు ఆదేశాలు జారీ చేశామని, ఇప్పటికే వెయ్యికి పైగా బస్సులు కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్థిక పరిపుష్టి శక్తి రైతన్న దగ్గరే ఉందని, రైతన్నలకు ఆర్థిక శక్తిగా ఎదగాలని, డిసెంబర్ 3 న గెలిచామని, 7 న మంత్రిగా ప్రమాణం చేశానని, 9న ఆర్టీసిలో మహిళలకు ఉచిత బస్సు అందించామని మంత్రి పొన్నం వివరించారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేశారని, 2100 కోట్లకు పైగా ఆర్టిసికి ప్రభుత్వం చెల్లించిందని, మహాలక్ష్మి పథకంతో ఆర్టిసి నష్టాలు లేకుండా నడుస్తుందని, పెద్దపల్లిలో ఆర్టిసి బస్సు డిపో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. గోదావరి ఖని బస్సు స్టాండ్ రూపురేఖలు మారుస్తామని, ఆర్టిసి ఉద్యోగులకు పిఆర్సి ఇచ్చామని, 2013 నాటి పెండిరగ్ బాండ్లు చెల్లించామన్నారు.
రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. చెప్పిందే చేస్తాము చేసేదే చెబుతామనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మొదటి విడతలో లక్ష రూపాయల లోపు
రుణమాఫీ చేశామని తెలిపారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్‌ఎస్ నాయకుల మాటలు ఉన్నాయని
విమర్శించారు. రైతు ఆదాయం పెరగడానికి ఆయిల్ ఫామ్ సాగు తోడ్పడుతుందని అన్నారు. రూ.170 కోట్ల వ్యయంతో పెద్దరాత్ పల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 250 మందికి ప్రతేక్షంగా 500మందికి పరోక్షంగా ఉపాధి పొందుతారని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి టేలండ్ ప్రాంత రైతులకు నీరు అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.