Search
Close this search box.

రుణమాఫీపై రైతులకు తీరనున్న బెంగ

నేడు బ్యాంక్‌ ఖాతాల్లో పడనున్న నగదు

లక్ష వరకు నేటి సాయంత్రానికి జమ

బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం

రైతులకు సందేశం ఇవ్వనున్న సిఎం రేవంత్‌

రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 

బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన హావిూ మేరకు రుణమాఫీకి ప్రభుత్వం అడుగులు వేసింది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. 70 లక్షల మంది రైతులకు రుణాలున్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్‌కార్డులు లేవు. వారికీ రుణమాఫీ వర్తిస్తుంది. రేషన్‌కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వమని కూడా స్పష్టం చేసింది. రుణమాఫీ జరిగే రైతులను రైతువేదికల వద్దకు తీసుకొచ్చి.. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారితో ఆ సంతోషం పంచుకోబోతున్నారు. ఇందుకోసం జిల్లాల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతాం. కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు డబ్బులు జమ చేయాలని 

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చింది. అదేరోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబురాలు జరపాలని నిర్ణయించింది. వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకం ఆధారంగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. కేవలం కుటుంబ వివరాలను గుర్తించడానికి మాత్రమే రేషన్‌కార్డు నిబంధన విధించినట్లు మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకం. దీని అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఏ ఒక్క రైతుకూ నష్టం జరగొద్దు. ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి. అదేరోజు సాయంత్రం సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలి. వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దు. గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మేమూ ఇప్పుడు అలాగే చేస్తాం అని సీఎం పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో ఆయన ఆదేశించారు. ఇదిలావుంటే గురువారం ఉదయం 10 గంటలకు ప్రజా భవన్‌ లేదా సెక్రెటరీయేట్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు హాజరుకానున్నారు. లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై బ్యాంకర్లకు సీఎం రేవంత్‌ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు. అక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో అన్ని మండల కేంద్రాలలో ఉన్న రైతు వేదికల్లో రైతుల సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులనుద్దేశించి సీఎం రేవంత్‌ రెడ్డి సందేశం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలులో భాగంగా తొలి విడతగా రూ.లక్ష మేర రుణాలున్న రైతుల ఖాతాల్లో గురువారం నగదు జమ జరగనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రుణమాఫీ లబ్దిదారులతో కలిసి సంబురాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి