Search
Close this search box.

ప్రజలతో మమేకం కండి

మానవీయ కోణంలో చర్య తీసుకోండి

తెలంగాణ సంస్కృతిలో విూరూ భాగస్వామ్యం కండి

ప్రజలకు కళ్లు చెవుల్లాగా మెదలండి

క్షేత్రస్థాయి పర్యటనలతోనే సమస్యలకు పరిష్కారం

కలెక్టర్ల సదస్సులో సిఎం రేంవత్‌ సూచన

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విూరేనని కలెక్టర్లతో సిఎం రేవంత అన్నారు. .. 

కలెక్టర్లలో వివిధ రాష్టాల్ర నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు కనుక ప్రజల మనసెరిగి ప్రవర్తించాలని అన్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చొరవ తీసుకోవాలని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలకు లబ్ది చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. ఏసీ గదులకే పరిమితమైతే విూకు కూడా సంతృప్తి ఉండదు. డిసెంబర్‌ 24న కలెక్టర్లతో తొలిసారి భేటీ నిర్వహించాం. ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించాం. ఎన్నికల కోడ్‌ ముగియగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. కలెక్టర్లలో వివిధ రాష్టాల్రనుంచి ఇక్కడికి వచ్చినవారున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చు. తెలంగాణను విూ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు లబ్ది చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా పనిచేయాలని రేవంత్‌ అన్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. 9 కీలక అంశాలతో ప్రభుత్వం ఎజెండా రూపొందించింది. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం ` కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం ` సీజనల్‌ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు ` ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర అంశాలను అందులో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్దిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో విూ నిర్ణయాలు ఉండాలి. ఒక శంకరన్‌, ఒక శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా విూరు పనిచేయాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి.. విూ ప్రతీ చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత విూపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే‘ అని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమన్నారు. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారని… అలాగే 

కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితనం ఉండాలని తెలిపారు. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్‌ శాంతి కుమారి, వివిధ జిల్లాల కలక్టర్లు,ఎస్పీలు, ఇతర ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. **

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి