Search
Close this search box.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటేయండి

ఫిరాయింపులను కట్టడి చేయాల్సిందే

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించండి

స్పీకర్‌ను కలిసిన బిఆర్‌ఎస్‌ బృందం

పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావు, పార్టీలో ఎమ్మెల్యేల బృందం స్పీకర్‌ను కలిశారు. ఈ మేరకు స్పీకర్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేటీఆర్‌ విూడియాతో మాట్లాడుతూ..తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారని తెలిపారు. స్పీకర్‌ ఆరు మాసాల్లోపు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మణిపూర్‌లో ఓ ఎమ్మేల్యేను అలాగే డిస్‌ క్వాల్గిª చేశారని తెలిపారు. అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్‌కే 

ఉన్నప్పటికీ మూడు నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని కేటీఆర్‌ అన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని రాహుల్‌ గాంధీ ఫోజులు కొడుతూ.. బయట ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. హర్యానాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే అక్కడ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ పోరాడుతోందని అన్నారు. గోవాలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పార్టీ మారబోమని ప్రమాణం చేయించారన్నారు. పార్టీ ఫిరాయింపులు అనైతికమని స్పీకర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ ఇచ్చామని కేటీఆర్‌ తెలిపారు. స్పీకర్‌ ఆ పది మందిపై అనర్హత వేటు వేస్తారని నమ్మకం ఉందన్నారు. కడియం శ్రీహరి ముందు నుంచే కోవర్ట్‌గా ఉన్నారని అనుమానం ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు కార్యక్రమాలు చేస్తున్నారని.. అధికారులు వారిని స్టేజి విూద కూర్చోబెడున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌తో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం వారు విూడియాతో మాట్లాడుతూ… పార్టీ కండువాలు కప్పుకుని ఓడిన అభ్యర్థులు చెక్కులు పంపిణీ చేస్తున్నారన్నారని సబిత అన్నారు. ప్రతిపక్ష ఎమ్మేల్యేలు రివ్యూ చేస్తే వచ్చే అధికారులను సస్పెండ్‌ చేస్తున్నారని తెలిపారు. ‘ఇదేనా ప్రజాస్వామ్యం.. పాలన ఎటువైపు పోతుంది‘ అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ హక్కులను పరిరక్షించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలా జరక్కుండా చూడాలని విజ్ఞప్తి చేశామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ నేత పద్మారావు అన్నారు. ప్రారంభాలకు, చెక్కుల పంపిణీకి ఓడిన అభ్యర్థులను అనుమతి ఇస్తున్నారన్నారు. మరి ఓడిన అభ్యర్థులను అసెంబ్లీలోకి కూడా అనుమతిస్తారా అని స్పీకర్‌ను అడిగినట్లు తెలిపారు. ªూగా… బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో స్పీకర్‌ను పార్టీ ఎమ్మెల్యేలు కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్‌ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి