Search
Close this search box.

విద్యుత్‌ కమిషన్‌ విచారణ జడ్జిని మార్చండి

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం సూచన

కెసిఆర్‌ పిటిషన్‌పై విచారణ

విద్యుత్‌ ఒప్పందాల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ జడ్జిని మార్చాలని సుప్రీం కోర్టు సూచించింది. కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ నరసింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారో చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్‌ మనుసింఫ్వీుని సుప్రీంకోర్ట్‌ ధర్మాసనం కోరింది. మెరిట్స్‌పైన జస్టిస్‌ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడిరచడంతో ఆయనను కొనసాగించకూడదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కాగా విద్యుత్‌ కమిషన్‌ జడ్జిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మధ్యాహ్నం 2 గంటలకు కొత్త జడ్జి పేరును వెల్లడిస్తామన్న ప్రభుత్వ తరఫు న్యాయవాది సింఫ్వీు సుప్రీంకోర్టుకు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ విచారణ జరిపారు. కేసీఆర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. విద్యుత్‌ విచారణ కమిషన్‌ నియామకంలో పరిధిని అతిక్రమించారని, ట్రిబ్యునల్స్‌ ఉండగా, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై ఎలా న్యాయ విచారణ ఎలా వేస్తారని రోహత్గి వాదనలు వినిపించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో విద్యుత్‌ సంక్షోభం నేపథ్యంలో విద్యుత్‌ కొనుగోలు చేశామని, మార్కెట్‌ రేట్‌ కంటే తక్కువగా యూనిట్‌ రూ.3.90లకు మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. ‘నేను మాజీ ముఖ్యమంత్రిని. ఇప్పుడున్న సీఎం ఈ అంశంపై అనేక సార్లు ఆర్‌టీఐ వేశారు. ఇది కక్ష సాధింపు చర్య. విచారణకు ముందే దోషిగా తేలుస్తున్నారు. కమిషన్‌ ఛైర్మన్‌ విూడియా సమావేశం పెట్టి మరీ చెప్తున్నారు. రాజకీయ దురుద్దేశ్యంతో చేస్తున్నారు‘ అని చెబుతున్న కేసీఆర్‌ వాదనలను ముకుల్‌ రోహత్గీ వినిపించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి