ఈ నెల18న రూ.లక్ష లోపు రుణాలకు ముందు చెల్లింపు
రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ఆదేశాలు
కలెక్టర్ల సమావేశంలో సిఎం రేవంత్ వెల్లడి
పంట రుణాల మాఫీ విషయంలో రేషన్‌కార్డు నిబంధనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్‌బుక్ ఆధారంగానే రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడిరచారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్‌కార్డు నిబంధన పెట్టినట్లు చెప్పారు. ఈ నెల 18న రూ.లక్ష లోపు రుణాలు మాపీ చేయనున్నట్లు తెలిపారు. ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రుణమాఫీ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు. రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాల ను విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ సోమవారం జీవో ఆర్టీ నంబరు 567 ఉత్తర్వులు జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. రైతు కుటుంబం గుర్తింపునకు తెల్లరేషన్ కార్డు(ఆహారభద్రత కార్డు)ను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అన్ని షెడ్యూల్డు, వాణిజ్య, ప్రాంతీయ గ్రావిూణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబరు 12 నుంచి మంజూరైన, రెన్యువలైన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని… రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. అయితే తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోనున్నట్టు ప్రకటించటంతో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు నిబంధనపై సీఎం స్పష్టత ఇచ్చారు. రూ.2లక్షల రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.. కొన్ని వివరణాత్మక అంశాలతో రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడిరచింది.. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి.. నోడల్ అధికారి నేతృత్వంలో రూ.2లక్షల రుణమాఫీ అర్హులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడిరచింది. రేషన్ కార్డు ప్రమాణికంగా ముందుగా స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది.. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ కార్డు ప్రమాణికంగా రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపింది. అయితే..రుణమాఫీ మార్గదర్శకాల విడుదల అనంతరం రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.. షరతుల్లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇదేంటంటూ అటు బీఆర్ఎస్ .. ఇటు బీజేపీ .. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి.. రుణమాఫీ మార్గదర్శకాలతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తే.. రేషన్ కార్డు ప్రామాణికతపై ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని.. అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ సైతం క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడిరచింది. జూలై 18న సాయంత్రంలోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి.. అదే రోజు రైతు వేదికల్లో
రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడిచింది. ఇదిలావుంటే రుణమాఫీ మార్గదర్శకాలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఆంక్షల పేరుతో రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని.. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవడం సరికాదంటూ పేర్కొన్నారు. రేషన్ కార్డ్ తప్పనిసరి నిబంధనతో రైతులకు అన్యాయం జరుగుతుందని.. బీఆర్ఎస్ హయాంలో ఆంక్షల్లేకుండానే రుణమాఫీ చేసినట్లు తెలిపారు. షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తంగా రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని.. పీఎం కిసాన్ నిబంధనలు వర్తింపుతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. పీఎం కిసాన్ రూల్స్‌తో సగం మంది రైతులకే మాఫీ జరుగుతుందన్నారు. రైతుల సంఖ్యను కుదించడమే..ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు.