Search
Close this search box.

మంచి వారికి స్వాగతం

ఎపిలో అంతా కలసి అభివృద్ది చేసుకుందాం

సేవ చేసేందుకే భగవంతుడు పునర్జన్మ ఇచ్చాడు

కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో చంద్రబాబు

మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్‌ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా ఉంటుంది. మంచి చేసే వారంతా ఏపీలో ఇక ముందుకు రావాలి. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలో 

అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం. హరేకృష్ణ సంస్థ దైవసేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోంది. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేం అన్నారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్‌ కృషి చేస్తున్నారు. 50 మంది ఐఐటీ పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలనూ కొనసాగించాలి. వేంకటేశ్వరస్వామి దయతోనే బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంతోపాటు ఇలాంటి స్వచ్చంద సంస్థల సహాయంతో రాష్టాన్న్రి అభివృద్ధి దిశలో నడిపిస్తామన్నారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశ్యంతోనే తిరుమల వెంకటేశ్వరస్వామి తనను కాపాడారన్నారు. తాను నమ్మేదేవుడు, ప్రార్థించే దేవుడు వేంకటేశ్వర స్వామి అని మరోసారి తెలిపారు. 2003లో తనపై 23 క్లైమోర్‌ మైన్స్‌ బాంబు బ్లాస్ట్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. అప్పుడు తన ప్రాణాలను కాపాడిరది తిరుమల వేంకటేశ్వరుడని గతాన్ని గుర్తు చేశారు. ఆది ఒక మిస్టరీ అని చెప్పారు.ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలి. అక్షయపాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్న క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయపాత్ర నిర్వహించిందని చంద్రబాబు తెలిపారు. హరేకృష్ణ సంస్థకు అన్నదానానికి దాతలు రూ.3 కోట్లు విరాళం ప్రకటించారు. పారిశ్రామికవేత్త పెనుమత్స శ్రీనివాస్‌రాజు రూ.కోటి విరాళం అందజేశారు. పూర్‌ టు రిచ్‌ స్ఫూర్తితో వంద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. హరేకృష్ణ సంస్థకు సక్కు గ్రూపు రూ.కోటి విరాళం, యలమంచిలి కృష్ణమోహన్‌ గ్రూపు రూ.కోటి విరాళం అందించాయి. శ్రీనివాస్‌రాజు, కృష్ణమోహన్‌, సక్కు గ్రూప్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూముల ధరలు పెరిగాయని తెలిపారు. రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్‌, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241223-WA0015
భారత రాజాగన్ని హేళన చేసిన అమిత్ షా
IMG-20241222-WA0220
వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ
ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు