Search
Close this search box.

విద్యార్థినుల పై లైంగిక వేధింపులు

HM9NEWS ప్రతినిధి నిజామాబాద్ జిల్లా:  విద్యార్దులు సమ్మేళనలో వెలుగు చూసిన విద్యార్థినుల పై లైంగిక వేధింపులు..పూర్వ విద్యార్థులకు, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విద్యార్థినిలు వెలుగు చూసిన కీచక ఉపాధ్యాయుల బాగోతం మీడియాకు తెలియకుండా పోలీస్ శాఖ దాస్తున్నారు.మన న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థాయిలో ఉంటారని ఆశించి ,తమ పిల్లలను ప్రత్యేక శిక్షణ ఇప్పించి నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే, అక్కడ బోధించే ఉపాధ్యాయులు, కీచక ఉపాధ్యాయులుగా అవతారం ఎత్తి, విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి, ఇటు పోలీస్ శాఖ, పూర్వ విద్యార్థులు ఉన్నత అధికారులకు చేసిన ఫిర్యాదులపై సమగ్రంగా అందిస్తున్న నవోదయలో కీచక ఉపాధ్యాయుల కథనం ఇది… ఏడాదికితం కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు పదవ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, ఈ విషయం అప్పట్లో సత్యవతి అనే ప్రిన్సిపాల్ కు తెలియడంతో ఆమె కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయిని కౌన్సిలింగ్ చేసి వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా,  కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయులతో చనువుగా ఉంటున్న విద్యార్థిని లోపర్చుకొని ,తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్మాయిని తన గదిలోకి రమ్మని చెప్పగా, ఆ విద్యార్థిని వెళ్లి ,9వ తరగతి చదువుతున్న అమ్మాయిని కోటేశ్వరరావు ఉంటున్న గదికి తీసుకువచ్చింది. గదిలోకి వచ్చిన అమ్మాయిని ఒక ఉపాధ్యాయుడు అని చూడకుండా ,అమ్మాయిని దగ్గర తీసుకొని కౌగిలించుకొని ముద్దులు పెట్టారు. ఈ విషయం ప్రిన్సిపల్ సత్యవతి దృష్టికి వెళ్లగా మళ్లీ మందలించి వదిలేశారు. పక్షం రోజుల క్రితం నవోదయ విద్యాలయంలో 32 మ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన లో, ప్రస్తుతం నవోదయ పాఠశాలలో లైంగక వేధింపులకు పాల్పడుతున్న విద్యార్థినులు లిఖితపూర్వకంగా పూర్వ విద్యార్థులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పూర్వ విద్యార్థులు ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి, నవోదయ విద్యాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, సిబ్బందిని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు…నిజం సాగర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందింది. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. నవోదయ పాఠశాలలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు నేరుగా జిల్లా కలెక్టర్ ను కలిసి తమపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. ఐసిడిఎస్ అధికారులను నవోదయ పాఠశాలలో జరుగుతున్న సంఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. వెంటనే ఐసిడిఎస్ అధికార బృందం నిజాంసాగర్ మండలం నవోదయ విద్యాలయంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో వాస్తవాలు వెలుగు చూశాయి. ఒక కోటేశ్వరరావు అని ఉపాధ్యాయుడు కాకుండా మరో ముగ్గురు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. కోటేశ్వరరావు, వేణుగోపాల్, సుభాష్ రామ్, అస్ తోస్ అనే ఉపాధ్యాయులు ఈ ఘటనకు పాల్పడుతున్నట్లు తేలింది. ఇక్కడ పనిచేస్తున్న సత్యవతి ప్రిన్సిపల్ బదిలీపై వెళ్లడంతో ఇన్చార్జిగా మరో ఉపాధ్యాయునికి బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ఉపాధ్యాయులు యద విధంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం వైస్ ప్రిన్సిపల్ దృష్టికి పోయినప్పటికీ ఆయన ఈ విషయాన్ని బయటకు రాకుండా లో లోపల ముగించారు. మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కావడంతో విద్యార్థినులు ఏకంగా ,తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం వెలుగు చూసింది. వారం రోజు క్రితం విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ కోటేశ్వరరావు, వేణుగోపాల్, సుభాష్ రామ్, అస్ తోస్ కీచక ఉపాధ్యాయుల పై నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో ఫోక్స్ చట్టం కింద కేసు నమోదయింది. వీరికి సహకరించిన వైస్ ప్రిన్సిపల్ పై కూడా కేసు నమోదు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద గత జరిగిన మీడియాకు పోలీస్ శాఖ వివరాలు ఇవ్వకుండా దాచడం పట్ల పోలీసుల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వ్యక్తిపై గాని ,ఒక అధికారిపై గాని కేసు నమోదు అయితే కచ్చితంగా మీడియాకు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిజం సాగర్ ఎస్సై శివకుమార్, మనదిన పత్రిక ప్రతినిధి వివరణ కోరడానికి ప్రయత్నిస్తే తాము వివరాలు బయటపెట్టాం అంటూ కరాకండిగా వివరణ ఇచ్చారు. ఎందుకు ఈ కీచక ఉపాధ్యాయులను పోలీస్ శాఖ కాపాడుతుందో అర్థం కావడం లేదు. బావి భారత పౌరులుగా ఎదిగే విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఈ కీచక ఉపాధ్యాయుల వివరాలు బయట పెట్టడానికి ఎందుకు వెనుక అడుగు వేశారు త్వరలో మన దినపత్రిక బయట పెట్టనున్నది..కిచక ఉపాధ్యాయులు అరెస్ట్ . రిమాండ్ ఉపాధ్యాయులు సస్పెన్షన్ నిజం సాగర్ నవోదయ పాఠశాలలో విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపలకు పాల్పడ్డ నలుగురు ఉపాధ్యాయులపై నిజాంసాగర్ పోలీసులు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదుచేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ నలుగురు ఉపాధ్యాయులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

భూ భరతి చట్టం పై అవగాహన సదస్సు
వాహనలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
స్కూల్ పిల్లల పై విష ప్రయోగం 30 మంది పిల్లలకు తప్పిన పెనుముప్పు
మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్స్ స్నేహితులు
భూగర్భ జలాల పై సమీక్ష సమావేశం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి