Hm9news ప్రతినిథి వరంగల్ జిల్లా: సంగెం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన పొలాస వెంకటయ్య మరియు వెంకటాపురం గ్రామానికి చెందిన కొత్తకొండ ఉప్పలయ్య చనిపోవడంతో మండల రజక కమిటీ వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునుకుంట్ల మోహన్, మండల అధ్యక్షులు బొడ్డుపెల్లి వెంకట్రాజం, మండల ఉపాధ్యక్షులు అల్గునూరి రమేష్, కొండ్రాతి పాణి, ప్రధాన కార్యదర్శి బర్ల సుమన్, మండల కమిటీ సలహాదారులు శంకర్, ఎల్లయ్య, రాములు మరియు ఆ గ్రామ రజక సంఘం అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు.