బీజేపీ నూతన యాక్షన్ ప్లాన్.. రేపట్నుంచే రంగంలోకి..
హైడ్రా, మూసీ కూల్చివేతల విషయంలో బీజేపీ కార్యచరణ రేపు(గురువారం) ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
మూసీ సుందరీకరణలో భాగంగా నిర్వాసితులయ్యే బాధితులను ఆదుకునేందుకు రేపట్నుంచే తమ పోరాటం ఉంటుందని ఆయన తెలిపారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇవాళ(బుధవారం) కిషన్ రెడ్డి పర్యటించారు.
అంబర్‌పేట్, అసెంబ్లీ, ముసారాంబాగ్, అంబేడ్కర్ నగర్, తులసి నగర్ మీదుగా కృష్ణానగర్ వరకూ బస్తీలను సందర్శించారు.
కేంద్రమంత్రి స్వయంగా వెళ్లి నిర్వాసిత కుటుంబాల బాధలను అడిగి తెలుసుకున్నారు.