యూనివర్సిటీ విద్యార్థులకు ABSF అండగా ఉంటుంది ABSF జిల్లా అధ్యక్షులు మంద నరేష్
హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ లో శుక్రవారం రాత్రి పద్మాక్షి గర్ల్ హాస్టల్ లో ఉండే మహిళా విద్యార్థులను ఉన్నపళంగా ఖాళీ చేయమని చెప్పిన కాకతీయ యూనివర్సిటీ అధికారులు తీరు సిగ్గు చేటు అని ABSF జిల్లా అధ్యక్షులు మంద నరేష్ అన్నారు ఈ సందర్బంగా విద్యార్థులు నిరసన చేస్తున్న స్థలానికి వెళ్లి వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా మంద నరేష్ మాట్లాడుతూ.కాకతీయ యూనివర్సిటీ అధికారులు విద్యార్థి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు.తక్షణమే యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థినీల పట్ల వ్యవహరించిన అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తో కలిసి నిరంతరం పోరాడుతామని హెచ్చరించారు.