గురుకుల్ ది స్కూల్ పాఠశాలలలో ఘనంగా జరుపుకున్న దీపావళి వేడుకలు.
హనుమకొండ బాలసముద్రంలోని గురుకుల్ ది స్కూల్ పాఠశాలలలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. దీనిలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సారిక మేడం దీపావళి పండుగ వెనుక ఉన్న పురాణ కథల గురించి పిల్లలకు తెలియజేశారు.
లక్ష్మీ పూజ చేసి నరకాసురుని వధించారు కొంతమంది పిల్లలు శ్రీకృష్ణుడు సత్యభామ వేషధారణలో వచ్చారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు సారిక మేడం ఈ విధంగా చెప్పారు విష్ణుమూర్తి భూదేవి కుమారుడైన రకాసురుడు అందరి వాళ్ళకి మరణం తప్పలేదు కాబట్టి తప్పు చేసే ప్రతి ఒక్కడు శిక్షించబడతాడు నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగే తరుణంలో పిల్లలు మంచి ప్రవర్తన కలిగి శ్రీరాముని లాగా జీవించారు చెడుపై మంచి గెలుస్తుంది అనే సందేశాన్ని పిల్లలకు అందించారు.
పాఠశాల డైరెక్టర్లు ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.