స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని సేవలు అందించారని స్మరించుకున్నారు.
తెలంగాణ కోసం తపించిన బాపూజీ అడుగుజాడల్లో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయన సేవలు నిరంతరం గుర్తుండాలన్న లక్ష్యంతోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.