Hm9 న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలో ని అంబేద్కర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళా బృందాల సభ్యులు స్వయం సహాయక బృందాల మహిళలకు ఉగాది కానుకగా వడ్డీ లేని రుణాలను VLR మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీమతి దానసరి అనసూయ సీతక్క, పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి కృతజ్ఞతా భావంతో పాలాభిషేకం చేసిన శాంతి మండల సమాఖ్య వివో అధ్యక్షులు, వివో ఏలు. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల బలోపేతానికి మరియు మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయుటకు బ్యాంకుల నుండి పొందిన రుణానికి చెల్లించిన వడ్డీని తిరిగి వడ్డీ లేని రుణాలుగా ఎస్ ఎస్ జి ల ఎస్ బి అకౌంట్ కు జమ చేయటం జరిగింది. సంగెం మండలంలోని 1026 స్వయం సహాయక సంఘాలకు 2 కోట్ల 41 లక్షల 8 వేల 6 వందల 62 రూపాయలు మంజూరు అయినవని ఎంపిడిఓ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి మండల సమాఖ్య కార్యదర్శి రాజమణి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మాధవ రెడ్డి, మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు బిక్కి రెడ్డి సంధ్యారాణి, మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి నరహరి, మాజీ జడ్పిటిసి వీరమ్మ, ఏపిఎం కిషన్, రావుల శ్రీనివాస్ రెడ్డి, జనగాం రమేష్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, అచ్చ నాగరాజు, నరసింహ నాయక్, ఆగపాటి రాజు, ఎండి పాషా ,విలాసాగరం వెంకటేశ్వర్లు, బండి రాధిక, గాయపు ఉమాదేవి, బానోతు మంగమ్మ అప్పాల కవిత సీసీలు బొజ్జ సురేశ్, గుండేటి ఏలియా, కుమారస్వామి కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి రవీందర్, వివోఏలు కృష్ణవేణి సుమతి విజయ ప్రభాకర్ శ్రీనివాస్ విజయ్ యాకయ్య మంజుల సుహాసిని మొదలగువారు పాల్గొన్నారు