*రాజన్న సిరిసిల్ల జిల్లా//-*
*వినాయక మండప నిర్వహకులకు కౌన్సిలింగ్*
*సిరిసిల్ల పట్టణ సిఐ కె కృష్ణ*
సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమజ్జన కమిటీ మండప సభ్యులను మరియు గత సంవత్సరం వినాయక నిమజ్జనంలో పోలీసు వారి సూచనలను ఉల్లంగించి ప్రజలకు ఇబ్బందులు కల్గించిన వారిని పోలీసు స్టేషన్ కి పిలిపించి సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ వారందరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా, గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి వినాయక నిమజ్జనంలో ఎటువంటి పొరపాట్లు మరియు ప్రజలకు ఇబ్బందులు జరగకుండా గతంలో జరిగిన ఆనవాయితీ కాకుండా నిర్దేశించిన సమయంలోనే నిమజ్జనాలు జరపాలని నిమజ్జన కమిటీ మండప సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వినాయక నిమజ్జనాలలో నిర్దేశించిన సమయంలో కాకుండా ఒకరోజు తీసి ఊరేగింపు చేసి మళ్లీ అదే స్థానంలో లేదా వివిధ ప్రదేశాలలో ఊరేగింపు వాహనాన్ని పెట్టి మరుసటి రోజు నిమజ్జనం చేస్తామని ఉంచినా లేదా విగ్రహాన్ని నిర్దేశించిన సమయంలోనే తీయకుండా మంటపంలోనే వదిలి వెళ్ళేవారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. సిరిసిల్ల పట్టణంలోని నిమజ్జన కమిటీ మండప సభ్యులు అందరూ నిమజ్జనం రోజున సిరిసిల్ల పట్టణం లోని అన్నీ వినాయక విగ్రహాలను నిమర్జనం చేయాలి. కాబట్టి ఏ రోజైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో అదేరోజు ఊరేగింపు మరియు నిమజ్జనం పూర్తి చేసుకోవాలి, లేనియెడల వారిపై చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. వినాయక ఊరేగింపులలో ఎటువంటి డీజే లకు అనుమతి లేదని సిరిసిల్ల పట్టణ సీఐ కె కృష్ణ తెలిపారు.