HM9NEWS ప్రతినిథి ములుగు జిల్లా: సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు చుక్కెదురైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపురం గ్రామంలో కులగణన సర్వేను గ్రామస్థులు బహిష్కరించారు. అనేక సంవత్సరాలుగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని గ్రామస్థులు వాపోయారు. అటవీ మార్గం గుండా గ్రామానికి చేరుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మించి, ఇతర సమస్యలను పరిష్కరించాకే సర్వే నిర్వహించాలని అధికారులను అడ్డుకున్నారు.