Search
Close this search box.

సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ను పరిశీలించిన్న జిల్లా కలెక్టర్

HM9NEWS ప్రతినిధి వరంగల్ జిల్లా సంగెం మండలం  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్లు ఎలాంటి తప్పులకు తావు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ఆదేశించారు. శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం తిగరాజుపల్లి, గవిచర్ల గ్రామాల్లో పర్యటించి కొనసాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ను పరిశీలించి మొదటి రోజు వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటర్లను కలెక్టర్ అడిగి తెలుసుకుని ఇబ్బందులు ఉంటే సూపర్వైజర్లకు, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నిర్వహిస్తున్నట్లు గ్రామాల్లో ముందుగా దండోరా వేయించాలని, నమోదు అనంతరం ఇంటికి స్టిక్కర్లు అతికించాలని సూచించారు. సర్వేను తహసీల్దార్లు, ఎంపీడీఓలు నిరంతరం పర్యవేక్షిస్తూ సూచనలు చేయాలన్నారు. ఎన్యుమరేటర్లకు పుర, గ్రామపంచాయతీ సిబ్బంది పూర్తి సహకారం అందిచాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాల సమయం ముగిసిన తర్వాత సర్వేలో పాల్గొనాలని అన్నారు. సర్వేలో భాగంగా ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇంటింటికి స్టిక్కరింగ్ వేయడం పూర్తి చేశామని, శనివారం నుండి ప్రభుత్వం నిర్దేశించిన ఫారం లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ మరియు కుల వివరాలను ప్రతి కుటుంబం నుంచి సేకరించి నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్యుమరేటర్లు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా దాదాపు 57కు పైగా అంశాలలో వివరాలను పొందుపరచాలని అన్నారు. ఈ సర్వే వలన ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తదితర వివరాలను తమ వద్ద ఉంచుకొని సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు అందించి వివరాలను నమోదు చేయించుకోవాలని కోరుతూ, సర్వే వివరాలను గొప్యంగా ఉంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, సిపిఓ గోవిందరాజన్, తహసీల్దార్ రాజ్ కుమార్, ఎంపిడిఓ రవి, గణకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి