Search
Close this search box.

సంగెం మండల కేంద్రంలోని గురుకుల ఎస్టీ బాయ్స్ హాస్టల్ ను తనికిలు చేసిన వరంగల్ కుడా ఛైర్మన్ 

Hm9న్యూస్ ప్రతినిధి వరంగల్ జిల్లా: సంగెం మండల కేంద్రంలోని గురుకుల ఎస్టీ బాయ్స్ హాస్టల్ లో పిల్లలు తల్లితండ్రుల సమావేశంలో అధికారికంగా పాల్గొన్న కాకతీయ పట్టణ అభివృద్ది సంస్థ (కుడా) ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి. అనంతరం పాఠశాల ఆవరణంలోని వంట గది, బాత్‌ రూములు, పిల్లల కోసం చేస్తున్న వంటలను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించనున్న అన్నం, కూరలను పరిశీలించి నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలని,ఆహార పదార్థాల్లో నాణ్యత లోటు ఉంటే చర్యలు తప్పవన్నారు. పిల్లలు మరియు వారి తల్లి తండ్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ బోధన ఎలా ఉందని, ఎలాంటి ఆహారం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పేరెంట్స్‌ మీటింగ్‌ నిర్వహిస్తున్నారా అని ఆరా తీశారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపాల్‌, కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం డైట్‌ అండ్‌ కాస్మోటిక్‌ చార్జీలను పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు, విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు ధైర్యం ఇచ్చి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో గ్రీన్‌ ఛానల్‌ ద్వారా మెస్‌ చార్జీలు చెల్లిస్తామన్నారు. విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు అన్ని రకమైన కిట్లు అందిస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,రానున్న పబ్లిక్ పరీక్షల్లో విధ్యార్థుల నుండి మంచి రిజల్ట్స్ సాధించేలా ప్లాన్ చేయాలని, పిల్లలకు మంచి ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రణస్వి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎంపీపీ కందగట్ల. కళావతినరహరి.
IMG-20241221-WA0090
సంగెం మండల కేంద్రంలో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241217-WA0193
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంటు ఏర్పాటు
అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేసిన కందగట్ల నరహరి
IMG-20241217-WA0147
జిల్లా స్థాయి సిఎం కప్ 2024 క్రీడలను ప్రారంబించిన వరంగల్ కుడా ఛైర్మన్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి